Reviews


img_3001
Sri.Thalasani.Srinivasa yadav garu.
Cinematography mister of telangana state.

మా పెద్ద కుమార్తె వివాహం nijam college grounds ( hyderabad ) లో
7/12/2014 న జరిగింది. ఆ వివాహం లో శ్రీమతి.కిరణ్మయి , తన తండ్రి పాతూరి.
రాధాకృష్ణ గారు ఇరువురు కలసి ఒకప్రక్క విచ్చేసిన అతిథులను ప్రముఖులను
ఆహ్వానిస్తూనే, మరొకప్రక్క జరుగుతున్న వివాహానికి చాలా చక్కని తెలుగులో
“ప్రత్యక్ష వ్యాఖ్యానం” చేసారు, మరల మా రెండవ కుమార్తె వివాహం లో కూడా
వీరే వ్యాఖ్యానం చెయ్యబోతున్నారు..

 



2
Sri.Koti garu
cine music director
ఇప్పటి వరకు 3 వివాహాలలో శ్రీమతి కిరణ్మయి వ్యాఖ్యానం విన్నాను. నేను, నా
మిత్రుని కుమారుడి వివాహం లో కూడా ఈమె వ్యాఖ్యానం పెట్టించడం జరిగింది. ఈ
కాలం యువతీ యువకులకు అర్థమయ్యే రీతిలో, సరళమైన తెలుగు లో, వివాహ వ్యవస్థ
గురించి చాలా అద్భుతoగా వ్యాఖ్యానించారు. ఈ కాలంలో వివాహ వ్యాఖ్యానం చాలా
అవసరం అని నా అభిప్రాయం.

 



3
Sri.Maganti babu garu
Eluru M.P

మా కుమారుడు రాంజీ వివాహం ఏలూరు లొ C.R రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో 25/3 /2016 లో
జరిగింది. సాయంత్రం 7 గంటల నుండి రిసెప్షన్ లో కొన్ని వేలమంది అతిథులను
ఆహ్వానించారు, అలాగే తెల్లవారుఝామున వివాహం లో బ్రాహ్మణులు చదువుతున్న
మంత్రాలకు తేట తెలుగు లో, స్పష్టంగా , అర్థాలను చెప్పి, తమ వ్యాఖ్యానం
ద్వారా మా అందరి దృష్టిని ఆకర్షించారు.

 



4
Sri.Lagadapati Rajagopal garu
Ex.MP, vijayavada.
మా సోదరుని కుమారుడు అభిరామ్ వివాహం విజయవాడ లోని, ఈడ్పుగల్లు సీతారామ
గార్డెన్స్ లో 14/12/2014 న జరిగింది. ఆ వివాహం లో శ్రీమతి కిరణ్మయి తన
శ్రావ్యమైన కంఠస్వరం తో, పండితులకు, పామరులకు అర్థమయ్యే రీతిలో చాలా
చక్కగా తేట తెలుగు లో వ్యాఖ్యానం చెప్పారు, మా అందరికి ఆవిడ వ్యాఖ్యానం
చాలా నచ్చింది.

 



5
Sri.Karumuri venkata nageswararo garu
Ex.MLA, Tanuku.
హైదరాబాద్ లో జరిగిన మా అమ్మాయి నిశ్చితార్ధం, వివాహం లో 2 సార్లు వీరు
ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని అందించారు. ఇరువురు మహిళలు అందులోనూ
తల్లి-కూతుర్లు వివాహానికి వ్యాఖ్యానం చెబుతుంటే, విచ్చేసిన బంధువులందరూ
ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీమతి.పాతూరి స్వరూపరాణి, శ్రీమతి.కిరణ్మయి ల
ప్రత్యక్ష వ్యాఖ్యానం అభిలషణీయం.

 



6
Sri.Veerisetti Hazarat babu garu
Managing director, murali krishna group of hotels, nellore.

మా నెల్లూరు లో జరిగే పెళ్ళిళ్ళకి బ్రాహ్మణులకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో,
శ్రీమతి. స్వరూపరాణి గారి వ్యాఖ్యానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు.
ఆ పెళ్ళికి స్వరూపరాణి గారి వ్యాఖ్యానం ఉంది అంటే, ఆ పెళ్లి వైభవమే వేరు.
ఎన్నిసార్లు విన్నా, మరల మరల వినాలి అనిపిస్తుంది ఈ వ్యాఖ్యానం, అంతటి
శ్రావ్యమైన, గంభీరమైన కంఠస్వరం ఆవిడది.